UPSC Main Exam 2024 Compulsory Subjects TELUGU- Previous Year Question Paper PDF Download
UPSC Main Exam 2024 Compulsory Subjects TELUGU- Previous Year Question Paper PDF Download
Civil Services (Main) Examination, 2024
PHKM-C-TLG
తెలుగు / TELUGU
(తప్పనిసరి) / (Compulsory)
నిర్దిష్ట సమయం : మూడు గంటలు
Time Allowed : Three Hours
గరిష్ఠ మార్కులు : 300
Maximum Marks : 300
ప్రశ్నపత్ర విశేష సూచనలు
ముందుగా ఈ క్రింది సూచనలన్నింటినీ జాగ్రత్తగా చదివి, సమాధానలను రాయండి :
అన్ని ప్రశ్నలకు సమాధానలను రాయాలి.
ఒక్కొక్క ప్రశ్నకు / విభాగానికి మార్కులు ఆ ప్రశ్నకే నిర్దేశింపబడి ఉంటాయి.
శీర్షికలో ప్రత్యేకంగా సూచింపబడిన స్థలాలలో తప్ప – అన్ని ప్రశ్నలకు సమాధానలు తెలుగులోనే (తెలుగు లిపిలోనే) రాయాలి.
ప్రశ్నల వద్ద నిర్దేశించిన పదాల సంఖ్యను పాటించక ఎక్కువ రాసినా, తక్కువ రాసినా, ఉక్త పరిమితికంటే హెచ్చుతగ్గులున్నా మార్కులను తగ్గించుటం జరుగవచ్చును.
ఈ లఘుపుస్తకంలో ఏదైనా ప్రశ్నకు, విభాగానికి సమాధానం రాయనప్పుడు ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టక, ఆ చోట స్పష్టంగా కొట్టివేయాలి.
Free PDF Download LINK Given in Last of This Post/ question Paper , For Image and Diagram Please refer to given PDF
UPSC Previous Year Question Paper, testbook ,UPSC Previous Year Question Paper PDF, UPSC Previous Year Question Paper PDF Download, UPSC Question Paper PDF Download, UPSC Previous Year Papers, UPSC Previous Year Papers PDF, UPSC Previous Year Paper Free D
UPSC Main Exam 2024 Compulsory Subjects TELUGU- Previous Year Question Paper PDF Download
Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting questions :
All questions are to be attempted.
The number of marks carried by a question / part is indicated against it.
Answers must be written in TELUGU (Telugu script) unless otherwise directed in the question.
Word limit in questions, wherever specified, should be adhered to and if answered in much longer or shorter than the prescribed length, marks may be deducted.
Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off.
UPSC Main Exam 2024 Compulsory Subjects TELUGU Previous Year Question Paper PDF Download
100
(a) ప్రజాస్వామ్యము మరియు భావప్రకటన స్వేచ్చ
(b) భారతదేశంలో మంచినీటి కొరత సమస్య ఆసన్నమవుతున్నదా ?
(c) గిరిజన సంస్కృతి పరిరక్షణ : పర్యత్నాలు సాధ్యాసాధ్యాలు
(d) ఓటీకుండకు శబ్దమెక్కవ
ఇ2. ఈ క్రింది గద్య భాగాన్ని శ్రేష్ఠగా చరివి, దిగువ జిబ్బిన ప్రశ్నలకు సరైన సమాధానాలను స్పష్టమైన, సరైన మరియు సంక్షిప్త భాషలో వాయండి : 12×5=60
విమర్శము, సామాత్యంలో ఒక బాగంగా పరిగణించాలి. ఎందుకంటే సామాత్యాన్ని దాని పరిధిలో ఉంచేది విమర్శయే కాబట్టి. రసప్రవాహానికి అడ్డు తగిలే విధంగా అనవసరంగా దేనినయినా ప్రవేశపెడితే అది దోషమవుతుంది. సంగీతంలో మాడండి ! శ్రుతి తప్పిన ద్వాని ప్రవేశిస్తే అది రసాబాస అవుతుంది.
మనసహజమైన భావవ్యక్తికరణలోనే ఆనందముంది. అసహజమైన భావ వ్యక్తికరణ ఆనందాన్ని కలిగించదు. అసహజమైన భావవ్యాపారంలో కూడా కొందరు వ్యక్తులు ఆనందాన్ని పొందే అవకాశం లేకపోలేదు. పొసాచరణ, పరులదనాన్ని అపహరించటం, ఇతరులకపకారం చేయటం వంటి స్వార్థపూరిత వ్యవహారాల వల్ల ఆనందాన్ని పొందితే పొందవచ్చును గాని అది మనసు యొక్క సహజధోరణి కాదు. దొంగ, వెలుతురు కంటే చికటిని ఎక్కువగా ప్రమిస్తాడు. అంతమాత్రంచేత వెలుతురు యొక్క గొప్పదనము తగ్గిపాదు.
ఇతరులలో మనలి మమేకం చేయగలిగే భావాలే సహజమైన భావాలు. ప్రేమభావనయే మనలను ఏకం చేస్తుంది. ద్వేషభావం విడదీస్తుంది. మితిమీరిన అహంకారం గలవాడు ఇతరులలో ఎలా కలుస్తాడు ? అందుకే మనిషికి, మనసుకు సహజమైంది ప్రేమ భావమే. అహంకార గుణం అసహజమైంది.
భక్తిభావాన్ని ఆచరించేందుకు ప్రత్యక్షంగా ఆధార భూతమైన వస్తువు యొక్క ఆవశ్యకత కనిపిస్తుంది. దయను చూపించాలంటే కూడా దానిని పొందే వాడుండాలి. ఓరిమిని మరియు దైర్యాన్ని చూపించాలన్నా అవతలిపైపు దానిని స్వీకరించగలిగే వ్యక్తులుండాలి. దీని త్రాత్పర్యమేమంటే భావ్య ప్రపంచంలోని వ్యక్తులతో, వస్తువులతో సామరస్య భావంతో జవిస్తూ మన భావాలను ప్రచోదితం
చేసుకోవాలి. మనం గమనించగలిగితే మనపైన బాహ్య ప్రపంచం యొక్క ప్రభావమే లేదు. ఇతరుల పుత్రశోకాన్ని చూచి నాలుగు దుఃఖాశ్రువులు కార్చలేకపోతే, ఇతరుల ఆనందోత్సవాలలో కలసి పాల్గొని సంతోషించలేకపోతే; మనం ప్రాపంచిక స్థితికంటే అతీతంగా ఉండి ‘నిర్వాణ’ (నిర్లిప్తత) స్థితికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవాలి. అటువంటి స్థితిలో సాహిత్యానికి ఎటువంటి విలువలేదు. ప్రపంచంలోని సుఖమైనా, దుఃఖమైనా ఇతరులతో కలిసి అనుభవించ గలిగే వాడే ఇతరుల కోసం ఆనందాన్నియా కరుణనియా సృష్టించగలడు, వాడే నిజమైన సాహిత్యకారుడు. తనకు తాను దుఃఖాన్ని అనుభవించటం కాదు. దాన్ని అభివ్యక్తీరించేవాడు కళాకారుడు. మానవుల్ని భిన్న పరిస్థితులు భిన్న మార్గాలలో నడిపిస్తాయి. మానవులందరిలో భావాల విషయంగా సమానత్వమే ఉన్నప్పటికీ, ప్రతిస్పందించే తీరుమాత్రం ఒకే విధంగా ఉండదు. మనం కర్షకజనావళితో కలిసి, వాళ్ల మధ్యనే జీవించే అవసరమేర్పడితే, సహజంగానే వాళ్ల సుఖసంతోషాల్ని, బాధల్ని పట్టించుకోవటం ప్రారంభిస్తాం. మనం కూడా మన భావ సాంద్రతను బట్టి వాళ్ల పరిస్థితుల చేత ప్రభావితమవుతాము. అదే విధంగా ఇతర పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకోవాలి. దీనిని అన్వయించి చూసినపుడు, ఒక వ్యక్తి వ్యవసాయ దారుల కోసమో, కార్మికుల కోసమో, ఇతర ఉద్యమాల కోసమో ప్రచారం చేయటం అన్యాయమవుతుంది. ప్రచారము, సాహిత్యము వీటిమధ్య గల తేడా ఏమిటి ? ప్రచారంలో మనసు ప్రమేయముందదు-ఆత్మవిజ్ఞాపనముందదు. ఉద్దేశించిన లక్ష్యానికి సంబంధించిన ఉత్సుకతాపూర్ణతప్ప సార్థకమైన ప్రమేయమేమీ ఉండదు. సాహిత్యం చల్లని మందమల యానిలం వంటిది. ప్రచారం, పచ్చగా ఎదిగే వృక్షాల్ని, గుడిసెల్ని, భవనాల్ని ఒకే విధంగా కూల్చే తుపాన్ లాంటిది. రసవిహీనమైన వస్తువేదీ ఆనంద కారకం కాదు. అందు చేత చాతుర్యం గల కళాకారుడెవరైనా, ఏవిషయాన్నయినా, వస్తువునయినా సౌందర్యంతో రసాత్మకతతో నింపి ఆనంద భరితం చేస్తాడు. అది కేవలం ప్రచార వస్తువుగా కాకుండ, మంచి సాహిత్యపు వస్తువుగా మలుస్తాడు.
(a) సాహిత్యంలో భాగంగా విమర్శను పరిగణించటానికి గల కారణమేమిటి ? 12
(b) సహజమూ, అసహజమూైన భావవ్యక్తీకరణల లక్షణమేమిటి ? 12
(c) మనసు యొక్క సహజ ధోరణి కానిదేమిటి ? 12
(d) రచయిత దృష్టిలో నిజమైన సాహిత్యకారుడెవరు ? 12
(e) సాహిత్యము, ప్రచారము వీటి మధ్యగల భేదమేమిటి ? 12
PHKM-C-TLG
3
ఈ క్రింది గద్యభాగాన్ని మే సాంతమాటలలో మూడవ వంతు పరిమాణానికి కుదించండి, దీనికి శీర్షిక అవసరంలేదు :
ఈర్థ్య, ఒక నిర్ణిష్ట వ్యక్తిని లక్ష్యం గా చేసేదని గుర్తెరగాలి. మనకు కేవలం సంపన్నులైన వారి పట్లు, గుణవంతులైన వారిపట్లు, గౌరవించబడేవారి పట్లు మాత్రమే అసూయ ఉంటుందనుకోవటం సరికాదు. ఏదైనా విషయంలో ఇతరులు మనలో పోల్చుకోవటం వలనగాని లేదా మనమే కొందరిలో పోల్చుకోవటం వలనగాని ఈర్థ్య ఆవిర్భవిస్తుంది. దాంలో పరస్పరం వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. దూరదూరంగా ఉండే వ్యక్తుల మధ్య, ఏమాత్రమూ సంబంధం లేని వ్యక్తుల మధ్య ఈర్థ్యలు ఉత్పన్నం కావు. కలసి ఉండే వ్యక్తుల మధ్యగాని, సమీపంలో ఉండే వ్యక్తుల మధ్యగాని పొలిక వచ్చినప్పుడే ఈ అసూయ ఆవిర్భవిస్తుందని మనం గుర్తించగలం. యూరప్ లో నివసించే వ్యక్తి కున్న సంపదను గురించి విన్న కాశిలోని ధనవంతుడు అసూయ చెందుతాడా ? చెందడు. ఆంగ్లకవికున్న ప్రాముఖ్యాన్ని చూచి, ఒక పొంది కవి అసూయపడడు. బంధువుల మధ్య, ఇరుగుభరుగు వారిమధ్య అసూయలు చెలరేగటాన్ని తరచూ మనం చూస్తుంటాం. ఆబాల్యంగా ఒకరినొకరు చూసుకుంటూ పెరిగిన వాళ్లు, ఒకళ్ల అభివృద్ధిని చూసి మరొకళ్లు అసూయ చెందే అవకాశముంది. ఇద్దరు స్పష్టాతులలో ఒకడు సపలుడై ఉన్నతిని సాధిస్తే, అదే ఉన్నతిని సాధించేందుకు తన స్పష్టాతుడు చేసే పొరాటానికి అతడు ఆటంకాల్ని సృష్టిస్తాడు. లోకంలో ఎవరికైనా తమ అభ్యయన్నతికి ఆటంకాలు ఎదురవులే, ఆ ఆటంకాలకు గల కారణాలను వెతికేత, వాటి వెనుక దీర్ఘకాలంగా తనలో స్పష్టంగా ఉన్నవ్యక్తే ఉన్నాడని తెలిసికోవటం అసాధారణమేమి కాదు. ఎప్పుడైతే మనము ఇతరులలో సంబంధాలను ఏర్పర్చుకొని, వారిని మనలో ఏకం చేస్తామో, మనము సానుభూతి మరియు సహాయం యొక్క సంబావ్యతను పెంపొందించుకోవడమే కాకుండా, అసూయ మరియు అసమ్మతిని కూడా పెంచుతాము. మన చేష్టలలో మంచితనాన్ని కనిపించినంతమేర వెలిగించుకుంటు పోవటమనే మార్గంలో తప్ప, భవిష్యత్తు పట్లు అభద్రతను పోగొట్టలేం. భవిష్యత్తు పట్లు ఉండే అభద్రతాబావం అజేయమైనది, అచంచలమైనది. మన విజ్ఞాన వివేకాలన్నిటీలో ప్రయత్నించినా దానిని పూర్తిగా అధిగమించలేం.
ఈర్ష్యతో కూడిన ప్రపంచంలో, ఈర్ష్యాళువులైన వ్యక్తులున్న సమాజంలో, ఈర్ష్యారహిత వ్యక్తిత్వాల్ని రూపొందించటమే సమాజపు తక్షణావసరం. సమాజపు దృష్టికోణం నుండి చూస్తే, సామాజిక ప్రభావంతో ఏర్పడిన అవసరపు ప్రేరణ వలననే అసూయమెదలవుతుంది. ఐశ్వర్యం, గుణం, గౌరవమేవి సమాజంలో నలుగురికి తెలియ కుండా రహస్యంగా వైయక్తికంగా ఆస్వాదించి వ్యక్తి అనుభవించగలిగేవి కావు. నిజంగా మనం సంపన్నులం కాకపోయినా, ఇతరుల కంటే గుణవంతులం కాకపోయినా సమాజం తమతో సమానులుగానో, ఉన్నతులుగానో చూస్తే సంతృప్తి పడతాం. అసూయాబాధితులం కాబోము. ఎంత చిత్రమైన విషయమంటే సమాజంలో ఎవరైనా ఏదైనా సాధించే ప్రయత్నంలో నష్టపోతే వాళ్లను చూసి సంతోషపడటం. ఈర్ష్య సమాజ జీవనంలోని కృత్రిమతనుండి ఉత్పన్నమయ్యే విషం. మన హితైషులకు, ఇతరుల పురోభివృద్ధికి అపకారాన్ని కలిగించే ఈ విషప్రభావానికి కారణం తెలిసికోకుండానే అసహ్యంగా దాని ప్రభావంతోనే జీవిస్తున్నాం.
న్యాయాధిపతి న్యాయాన్ని చెప్పుతాడు, కార్మికుడు ఇటుకల్ని తయారు చేస్తాడు. సాంఘిక సంక్షేమ దృక్కోణంలో, జడ్డి ఇటుకల కార్మికుడి పట్ల అతను ఏవిధంగానైనా తక్కువ స్థాయిలో ఉన్నాడని వ్యక్తపరచడం సముచితం కాదు. సమాజంలో ‘ఎక్కువ-తక్కువ’ భావన బాగా పాదుకొనిపోయింది. ఇది భిన్న వర్గాల మధ్య దృఢంగా బలపడి, సమైక్యతా చైతన్యాన్ని, సాంఘిక వికాసాన్ని చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే చూపెడుతున్నది. ఒకవేళ సమాజంలో వాళ్ల వాళ్ల జీవనోపాధులైన వృత్తుల మధ్య చిన్న-పెద్ద, గొప్ప-తక్కువ అనే భేదాలులేకుండా, విభిన్న వృత్తుల వారిని గౌరవించినట్లయితే, సమాజంలో అసంతృప్తిని పెద్దయెత్తున నిర్మూలించవచ్చు. ఎక్కడ ఈ ఎక్కువ తక్కువలన్న భేద భావన బాగా ప్రచారమవుతుందో, అక్కడ మానవ ప్రవర్తనపై అది చూపించే ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మానవ శక్తి, ప్రత్యేకమైన కొన్ని ప్రదేశాలకే పరిమితమయ్యేవిధంగా మార్గదర్శనం చేయబడుతుంది. కార్యవిభాగాలు అసంతులనం చెందుతాయి.
(361 పదాలు)
PHKM-C-TLG
5
Q4. ఈ క్రింది తెలుగు వచనాన్ని ఆంగ్లంలోనికి అనువదించండి : 20
కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు గురించిన చర్చ భారత దేశంలో ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నది. చిన్న ప్రాంగణాలతో, కనిస మూలధనాన్ని పెట్టుబడిగా, తక్కువ కార్మిక వ్యయంతో గృహాధారిత వ్యాపారాలను స్థాపించే భావన అటువంటి పరిశ్రమ యొక్క ప్రధాన అంశం. వ్యక్తులు ఉత్పత్తిదారులుగా లేదా తయారీదారులుగా మారటానికి ఈ నమూనా దోహదం చేస్తుంది, జీవనోపాధిని పొందటానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటుంది మరియు తద్వారా ఇంకా నిరుద్యోగంతో పోరాడుతూ మెరుగైన జీవన ప్రమాణాలను పొందటానికి దారితీస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు మాత్రమే భారతదేశం లాంటి దేశాల అభివృద్ధికి దోహదం చేస్తాయనే వాస్తవాన్ని స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే గాంధీజీ ఊహించారు. ఆయన చిన్న ఉత్పత్తి యూనిట్లను తయారు చేయటానికి, సాంప్రదాయిక పరిశ్రమల్ని పునరుద్ధరించటానికి ప్రజలను ప్రేరేపించాడు. ఇటువంటి దూరదృష్టి ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యానంతర నాయకత్వం ఈరంగాన్ని పెద్దగా విస్మరించి, పెద్దపరిశ్రమలు ఆధిపత్యం చలాయించేలా చేసింది. ఈ పరిశ్రమలు సంపన్న వర్గాల వ్యక్తిగత ఆస్తులుగా మిగిలి పోయాయి. జనాభా పెరుగుదల, విద్యావ్యాప్తి, ప్రజలలో కలుగుతున్న జాగృతి, వ్యక్తుల హక్కుల్ని గుర్తించి వాటికై డిమాండు చేయటం, నానాటికే పెరిగిపోతున్న నిరుద్యోగుల సంఖ్య – ఇవన్నీ చైతన్య శీలురైన ఈ నాటి ఆలోచనాపరులను గాంధీ సిద్ధాంతాల్ని పునః పరిశీలించటానికి ప్రేరేపించాయి. అసలులేని స్థితి కంటే, ఆలస్యంగానైనా ప్రారంభం కావటం మంచిదేకదా ! నేడు చిన్న తరహా పరిశ్రమలను, దేశ అవసరాలతో సంతులనం చేసికోవాలనే అవగాహన పెరుగుతోంది. పర్యవసానంగా కుటీర పరిశ్రమల నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించింది.
PHKM-C-TLG
6
20
In our democratic system, the press has a vital role. While there has been large- scale expansion of the print and visual media in recent years, a focused approach to dealing with major societal and political issues has still to evolve. There is, as yet, excessive and exaggerated coverage of exposures and scandals and far too little well- informed comment or analysis of the various deep- rooted factors which generate the continuing malaise. The media could make an extremely useful contribution by devoting adequate coverage to tasks well done, highlighting the achievements of honest and efficient public servants and organizations, according special attention to developments in the remote and backward areas of our country. Our media is free and unfettered. It should be able to expose cases and incidents involving irregular and unlawful exercise of authority and abuses of all kinds. The existing ills in our socio- political environment will, on present reckoning, take considerable time to remedy. The Department of Personnel and Administrative Reforms should focus on establishing institutions responsible for all personnel matters — appointments, postings, transfers etc. — without any external interference. Also, there is a need for adoption of a robust code of ethics to be followed by those involved in public functioning.
06. (a) 2x5=10
(i) 2 (ii) 2 (iii) 2 (iv) 2 (v) 2
2x5=10
(b) ఈ క్రింది వాటికి సమానార్థక పదాలను రాయింది: 2×5=10 (i) పూవు 2 (ii) పాయి 2 (iii) పొగడ్డ 2 (iv) ఆలస్యం 2 (v) ఇల్లాలు 2
(c) ఈ క్రింది వాటికి వ్యతిరేకార్థక పదాలను రాయింది: 2×5=10 (i) పండితుడు 2 (ii) సులభము 2 (iii) కృతజ్ఞత 2 (iv) స్వాతంత్ర్యం 2 (v) సాపేకము 2
(d) ఈ క్రింది పదాలలోని తప్పనిల్పి సరిచేయండి: 2×5=10 (i) ద్రైపతి స్వయంవరం 2 (ii) చిత్రసుద్ధి 2 (iii) ధృకోషణము 2 (iv) చెరవాణి 2 (v) సృష్టస్తితులు 2
UPSC MAIN Compulsory Subjects Free PDF Download-TELUGU
Other Question Paper :
UPSC Main Exam 2024 Compulsory Subjects TAMIL- Previous Year Question Paper PDF Download
UPSC Main Exam 2024 Compulsory Subjects Sanskrit- Previous Year Question Paper PDF Download
UPSC Main Exam 2024 Compulsory Subjects SINDHI Previous Year Question Paper PDF Download